Site icon vidhaatha

సెప్టెంబర్ 1న ఏపీ పాలిసెట్

రాష్ట్రంలో 45 కోఆర్డినేషన్ కేంద్రాలు

విధాత:అమరావతి: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే పాలీసెట్ సెప్టెంబర్ 1వ తేదీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. (2021-22) విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష జరుగుతుంది. పదవ తరగతిలో ఉత్తీర్ణులైన వారంతా పాలిసెట్ రాయ‌డానికి అర్హులు. రాష్ట్రం మొత్తంగా ఇందుకోసం 45 సమన్వయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు లక్షా 50 వేల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్టీఈటీ) చైర్మన్, కమిషనర్లు పరీక్షల నిర్వహణకు అనుభవం ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్న నియమిస్తారు. ప్రైవేట్ సంస్థలకు చెందిన ఓ ప్రతినిధి అసిస్టెంట్ కోఆర్డినేటర్గా నియమితులవుతారు.

విస్తృత బందోబస్తు నడుమ పరీక్షలను కట్టుదిట్టంగా ప్రశాంతంగా నిర్వహించాలని ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఆరుగురు కానిస్టేబుళ్లు, పోలీస్ అధికారులతో బందోబస్తు నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రాలను పరీక్షా సమయానికి రెండు గంటల ముందు కోఆర్డినేటర్కు అందజేస్తారు. రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖ అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటవుతాయి. పాఠశాల విద్య డైరెక్టర్, కళాశాల విద్య కమిషనర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనడ్, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్, అన్ని విశ్వ విద్యాలయాల వైస్చన్సార్లు ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎస్పీలు, విజయవాడ, విశాఖపట్నం అర్బన్ పోలీస్ కమిషనర్లు తమ విభాగాల నుంచి పరీక్షల నిర్వహణకు సిబ్బందిని డిప్యూటేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Exit mobile version