విధాత:సిబ్బంది జీతాల సమస్య ఇప్పటివరకు మాన్సాస్‌కి రాలేదని ఆ సంస్థ చైర్మన్ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీతాల చెల్లింపుని అధికారులు సమస్యగా భావించటం సరికాదన్నారు.సిబ్బంది లేకపోతే సంస్ధలకు మనుగడే ఉండదన్నారు.సిబ్బంది పనిచేసేది జీతాల కోసం.. ఈవో ఇబ్బందులు కలిగించటం భావ్యం కాదన్నారు. జీతమడిగితే కేసులు పెడతారా..? అని ప్రశ్నించారు. సిబ్బందిని మీరేమి చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మాన్సాస్ చైర్మెన్‌గా తాను అడిగిన వాటికి సమాచారం ఇవ్వలేదన్నారు. జీతం రాకపోతే ఈవో పనిచేయగలరా అని చైర్మన్ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు.