వైసీపీ ఫ్యాక్షన్ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను :లోకేష్
విధాత: ఆంధ్రప్రదేశ్ అరాచకాలలో ఆఫ్ఘనిస్తాన్ ని మించిపోయిందన్నారు నారా లోకేష్.ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్ గా పనిచేశారనే కక్షతో గుంటూరుజిల్లా, పిడుగురాళ్ళ మండలం, తుమ్మలచెరువుకు చెందిన టీడీపీ కార్యకర్త సైదా పై వైసీపీ రౌడీమూకలు నరరూపరాక్షసుల కంటే ఘోరంగా దాడి చేయడం చూస్తే..రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి భీతిగొలుపుతోంది..పొలం తగాదా నెపంతో వైసీపీ ఫ్యాక్షన్ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసులు నిద్ర నటిస్తుంటే..వైసీపీ ఫ్యాక్షన్ మూకలు పట్టపగలు ఇలా బరితెగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.కాగా టీడీపీ కార్యకర్తని నడిరోడ్డుపై కొందరు వ్యక్తులు దారుణంగా కొడుతున్న వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతుంది.