విధాత:పోకల గోపీ కృష్ణ ను అదుపులోకి తీసుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు.మంగళగిరి రామచంద్రపురం కట్ట పై విజయవాడ కు చెందిన గోవిందు గోవర్ధని అనే మహిళను ఆర్ధిక లావాదేవీల నేపథ్యంలో ఈ రోజు ఉదయం చిర్రావురుకు చెందిన ఆటో డ్రైవర్ గోపీ కృష్ణ దాడి చేశాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ ఎస్ ఐ లోకేష్ నిందితుడి ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.