విధాత,అమరావతి: మోసపూరిత ఎన్నికల హామీలే వైకాపాకు భస్మాసుర హస్తంగా మారుతున్నాయని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు ధ్వజమెత్తారు.ఉద్యోగాల కల్పనలో జగన్ ప్రభుత్వం చేసిన నమ్మకద్రోహం,మోసం భరించలేకే నిరుద్యోగులు సీఎం ఇంటిని ముట్టడించారన్నారు. నిరుద్యోగులు ఉద్యమం చేస్తే తప్ప వాస్తవాలు బోధ పడని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. కడుపుమంటతో రోడ్డెక్కిన యువతను అవహేళన చేస్తే 151 సీట్లు ఉన్న ప్రభుత్వం కూడా పేకమేడలా కూలిపోవడం ఖాయం అని వ్యాఖ్యానించారు.