Site icon vidhaatha

BreakingNews:వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో వైఎస్ విజయమ్మ

విధాత:వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో వైఎస్ విజయమ్మ ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్‌టీపీకి గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. కూతరు షర్మిల రాజకీయ భవిష్యత్తు కోసం విజయమ్మ వేగంగా పావులు కదుపుతున్నారు. ఎల్లుండి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నోవాటెల్ ముఖ్యనేతలతో ఆమె సమావేశం కానున్నారు.ఈ సమావేశానికి వైఎస్సాఆర్ కి అతి దగ్గరగా ఉన్న నేతలకు ఆహ్వానం పలికినట్టు తెలుస్తోంది.అక్కడే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే ఛాన్స్ ఉంది.ప్రస్తుతం విజయమ్మ వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

Exit mobile version