Site icon vidhaatha

మాన్సాస్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు

విధాత:కేంద్ర మాజీ మంత్రివర్యులు,మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌,పూసపాటి అశోక్‌గజపతిరాజుపై విజయనగరం ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.ట్రస్టు ఈవో వేతన ఖాతాలు నిలుపుదల చేయడం పట్ల ఈనెల 17న విద్యాసంస్థల ఉద్యోగులు మాన్సాస్‌ ఛైర్మన్‌ను కలిశారు.అనంతరం ఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.వేతనాలు ఎందుకు నిలిపివేశారంటూ ఈవోను నిలదీశారు.ఈ క్రమంలో ఈవో,ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.ఈ ఘటనకు సంబంధించి.. కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన, ఈవోపై దాడికి ప్రేరిపించారనే ఆరోపణలతో అశోక్‌గజపతిరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఛైర్మన్‌, కరస్పాండెంట్‌ సహా 10మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version