Site icon vidhaatha

ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రిని విచారిస్తున్న సీబీఐ

విధాత:మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తండ్రి, వైసీపీ పులివెందుల ఇన్‌చార్జి వైఎస్‌ భాస్కరరెడ్డిని సీబీఐ బుధవారం మరోసారి విచారించింది. భాస్కర్‌రెడ్డి సోదరుడు వైఎస్ మనోహర్‌రెడ్డిని కూడా మరోసారి విచారిస్తోంది. ఈ నేపథ్యంలో కడపలో సీబీఐ అధికారులను వివేకా కుమార్తె సునీత కలిశారు. ఇప్పటికే హైకోర్టుకు, ఢిల్లీలో సీబీఐ అధికారులకు అనుమానితుల లిస్టును ఇచ్చిన విషయం విదితమే.

Exit mobile version