Site icon vidhaatha

కడపకు చేరుకున్న సీబీఐ ఎస్పీ

మహిళా అధికారి స్థానంలో బాధ్యతల స్వీకరణ

విధాత:మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు నిమిత్తం కొత్తగా ఎస్పీ స్థాయి సీబీఐ అధికారి ఒకరు ఆదివారం కడపకు చేరుకున్నారు. ఇప్పటి వరకు మహిళా అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తు జరగ్గా.. ఆమె ఇటీవల దిల్లీకి వెళ్లిపోయారు. ఆమె స్థానంలో ప్రస్తుతం కొత్త అధికారి బాధ్యతలు చేపట్టారు. ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరిన సమయంలో ఈ మార్పు చర్చనీయాంశంగా మారింది. రెండురోజులుగా సీబీఐ అధికారులు అనుమానితులెవరినీ విచారణకు పిలవలేదు. సీబీఐ అధికారుల నుంచి పిలుపు రాకపోవడంతో తాను ఆదివారం కడపకు వెళ్లలేదని రంగన్న తెలిపారు. వాళ్లు పిలిచినప్పుడు విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. ఆదివారం ఉదయం నుంచి తనకు జ్వరంగా ఉండటంతో విశ్రాంతి తీసుకుంటున్నాని పేర్కొన్నారు.

Exit mobile version