Site icon vidhaatha

జేసీ వినూత్న నిరసన అక్కడే నిద్ర.. స్నానం

విధాత:నిన్న ఉదయం మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఏర్పరచిన సమావేశానికి మునిసిపల్ ఉద్యోగులు గైర్హాజరు అవ్వడంతో దాదాపు 20 గంటలుగా జెసి ప్రభాకర్ రెడ్డి మునిసిపల్ కార్యాలయంలో నే ఉద్యోగుల రాకకోసం నిరీక్షిస్తున్నారు.నిన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డితో సమీక్ష తర్వాత సెలవుపై మున్సిపల్ కమిషనర్‌ వెళ్లిపోయారు. ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకూ… మున్సిపల్ ఆఫీస్‌లోనే ఉంటానని జేసీ వెల్లడించారు.రాత్రి భోజనం కూడా ఆయన కార్యాలయం ఆవరణలో చేసి అక్కడే నిదురించడం జరిగింది.ఇప్పుడు ఉదయం స్నానం చేసి ఆయన తిరిగి ఉద్యోగుల రాకకోసం వేచి చూస్తున్నారు.

Exit mobile version