విధాత: తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన గెజిట్‌పై పూర్తిగా అధ్యయనం చేశాకే స్పందిస్తానని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బచావత్ ట్రైబ్యునల్‌కు, గెజిట్‌కు ఉన్న వ్యత్యాసాలను లోతుగా పరిశీలించాలని తెలిపారు. దీనిపై వైకాపా ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల బాధ్యత లేకుండా సీఎం వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోరాడతామని వివరించారు.