విధాత:ఈరోజు శుక్రవారం ఉదయం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దుర్గగుడి అమ్మవారి మీద ప్రమాణం చేయడానికి రాలేదు అంటేనే వారు క్యాపిటల్ బిజినెస్ పార్క్ వారి బినామీ సంస్థ అని అంగీకరించినట్లయింది.ఒక వార్డ్ వాలంటీర్ మీదనే చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వారి మంత్రిమండలిలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కి వందల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చే జీవో నెంబర్ 61 జారీ చేసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు మేకపాటి గౌతమ్ రెడ్డి పై చర్యలు తీసుకొరా?ముఖ్యమంత్రి అవినీతి పక్షమా ప్రజాపక్షమో తొందరలో తేలిపోతుందని పోతుల మహేష్ అన్నారు.