Site icon vidhaatha

రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్ ధ్యేయం.. ధర్మాన కృష్ణదాస్

విధాత:రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పోలాకి మండలంలో రైతు చైతన్య యాత్రలో వ్యవసాయ శాఖ కమిషనర్ హనుమంతు అరుణ్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.తొలుత రైతు చైతన్య రథాన్ని ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ శాఖ ఏర్పాటుచేసిన పలు స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా, రైతాంగం అభ్యున్నతే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కే. శ్రీధర్, డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version