Site icon vidhaatha

సీఎం జగన్ కేసు ఆగష్టు 25కు వాయిదా

విధాత:ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఆగష్టు 25కు వాయిదా వేసింది.కేసుకు సంబంధించి ఈరోజు సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. కోర్టు విచక్షణ అధికారులకే నిర్ణయం వదిలేసామంటూ దాఖలు చేసిన మెమోను పరిగణలోకి తీసుకోవాలంటూ కోర్టును సీబీఐ కోరింది. కాగా ఇప్పటికే జగన్ తరపు న్యాయవాదులు, పిటిషనర్ రఘురామకృష్ణం రాజు లాయర్లు లిఖితపూర్వకమైన వాదనలు కోర్టుకు సమర్పించారు.

ఈ మూడింటిని పరిగణలోకి తీసుకున్న అనంతరం ఆగష్టు 25న కోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జగన్, పిటిషనర్ తరపు న్యాయవాదులు రిజైండర్ వేసినప్పటికీ సీబీఐ అధికారులు మాత్రం కేవలం కోర్టు విచక్షణ అధికారులకే నిర్ణయం వదిలేస్తున్నామంటూ దాఖలు చేసిన మెమోను పరిగణలోకి తీసుకోవాలని కౌంటర్‌లో పేర్కొన్నారు.అదే విషయాన్ని ఆన్ రికార్డుల్లోకి తీసుకోవాలని ఈరోజు సీబీఐ తరపు న్యాయవాదలు వాదనలు వినిపించారు.ఈ క్రమంలో కేసు సంబంధించి ఆగష్టు 25న కోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Exit mobile version