కోవిడ్ -19 మహమ్మారిని అరికట్టడానికి ప్రజలలో అవగాహన కల్పించడానికి సహకరించండి

ఆధ్యాత్మిక, మత పెద్దలకు విజ్ఞప్తి చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకొని కోవిడ్ వైరస్ బారి నుండి రక్షింక్షుకునే విధానాలపై ప్రజలలో అవగాహన కల్పించడండానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్బిస్వభూషన్ హరిచందన్ రాష్ట్రంలోని వివిధ మత మరియు ఆధ్యాత్మిక సంస్థల పెద్దలను ఉద్దేశించి రాజ్ భవన్ నుండి వర్చువల్ మోడ్‌లో సోమవారం జరిగిన వెబినార్ లో ప్రసంగించారు. మన దేశ ప్రజల జీవితాలలో మతం మరియు విశ్వాసానికి ఒక […]

  • Publish Date - May 3, 2021 / 12:30 PM IST

ఆధ్యాత్మిక, మత పెద్దలకు విజ్ఞప్తి చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్

కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకొని కోవిడ్ వైరస్ బారి నుండి రక్షింక్షుకునే విధానాలపై ప్రజలలో అవగాహన కల్పించడండానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్బిస్వభూషన్ హరిచందన్ రాష్ట్రంలోని వివిధ మత మరియు ఆధ్యాత్మిక సంస్థల పెద్దలను ఉద్దేశించి రాజ్ భవన్ నుండి వర్చువల్ మోడ్‌లో సోమవారం జరిగిన వెబినార్ లో ప్రసంగించారు.

మన దేశ ప్రజల జీవితాలలో మతం మరియు విశ్వాసానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని, ప్రస్తుత విపత్కర పరిస్తుతులలో ప్రజలు ఆందోళ చెందకుండా, ప్రశాంతంగా ఉండడానికి కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నుండి ప్రజలను రక్షించడానికి, వారిలో మనస్తైర్యం నింపడానికి వివిధ మత మరియు ఆధ్యాత్మిక సంస్థల పెద్దలు ముందుకు రావాలని గవర్నర్ శ్రీ బిస్వ భూషన్ హరిచందన్ కోరారు. కోవిడ్ -19 మహమ్మారి మానవాళి మొత్తానికి ఒక సవాలుగా నిలిచిందని ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ బిస్వ భూషన్ హరిచందన్ అన్నారు.

ప్రజలలో ఆత్మస్థైర్యం నింపే విధంగా మత పెద్దలు కోవిడ్ పై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని గవర్నర్ కోరారు. మాస్క్ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం వంటి కోవిడ్ మహమ్మారిని అరికట్టే చర్యలు తీసుకోవడానికి ప్రజలలో అత్యవసరంగా అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని గవర్నర్ చెప్పారు. ప్రజలు తమను కాపాడుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు , సమాజం లోని ఇతర ప్రజలకు కోవిడ్ బారి నుండి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాలని వారి అనుచరులకు ప్రత్యేక విజ్ఞప్తి చేయాలని వెబ్‌నార్‌లో పాల్గొన్న మత, ఆధ్యాత్మిక నాయకులను గవర్నర్ శ్రీ హరిచందన్ కోరారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి తీసుకోవలసిన తప్పనిసరి జాగ్రత్తలు మరియు ఇంట్లో ఉండవలసిన అవసరం గురించి, అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండటం, ఇంట్లో ఉంటూనే పండుగలు జరుపుకోవడం వంటి వాటిపై తమ ప్రసంగాలతో ప్రజలకు అవగాహన కలిగించాలని ఆధ్యాత్మిక మరియు మత పెద్దలను గవర్నర్ కోరారు.

శుభ కార్యాలు, ఇతర కార్యక్రమాలు ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని లేదా వాటిని చాలా పరిమిత సభ్యులతో కోవిడ్ మార్గదర్శకాలను సక్రమంగా పాటిస్తూ జరుపుకునే విధంగా ప్రజలకు తెలియ చెప్పాలని గవర్నర్ కోరారు.
కోవిడ్ వాక్సిన్ కరోనా వైరస్ నుండి రక్షణను ఇస్తుంది కావున అర్హత ఉన్న వారందరూ కోవిడ్ వాక్సిన్ అత్యవసరంగా తీసుకోవాలని గవర్నర్ శ్రీ హరిచందన్ చెప్పారు. కోవిడ్ లక్షణాలను ముందుగా గుర్తించడం ద్వారా ఇంట్లో గాని హాస్పిటల్ లో గాని వెంటనే చికిత్స తీసుకుంటే కరోనా వ్యాధిని నయం చేయవచ్చు ఇంకా మరణాల సంఖ్య తగ్గించవచ్చని గవర్నర్ చెప్పారు.

కరోనా మహమ్మారి సమూలంగా నిర్మూలించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలలో చురుకైన పాత్ర వహించ వలసినదిగా గవర్నర్ శ్రీ హరిచందన్ మత మరియు ఆధ్యాత్మిక పెద్దలకు విజ్ఞప్తి చేశారు.

Latest News