Site icon vidhaatha

ముగిసిన దుర్గ గుడి పాలకమండలి సమావేశం

విధాత,విజయవాడ: దుర్గ గుడి పాలకమండలి సమావేశం ముగిసింది. 66 అజెండాలపై పాలకమండలి చర్చించింది. భక్తులకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లుచేస్తున్నామని పాలకమండలి చెబుతోంది. ప్రతి భక్తుడికి 250 గ్రాముల దద్దోజనం, 250 గ్రాముల సాంబార్ రైస్ ప్రసాదంగా పంపిణీ చేయాలని పాలకమండలి తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. ప్రతి భక్తుడికీ కుంకుమ, అమ్మవారి ప్రతిమ ఉన్న డాలర్ పంపిణీ చేయాలని, దసరాకు సంబంధించి ఏర్పాట్లపై సిద్ధంగా ఉన్నామని పాలకమండలి ప్రకటించింది.

Exit mobile version