Site icon vidhaatha

విజయవాడలో కాంగ్రెస్ సైకిల్ ర్యాలీ… అడ్డుకున్న పోలీసులు

విధాత,విజయవాడ :నగరంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సైకిల్ ర్యాలీని అజిత్ సింగ్ నగర్ పోలీసులు అడ్డుకున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువులు, పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరుతూ విజయవాడ సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ చేపట్టారు. కాగా ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు స్వల్ప వాగ్వాదం జరిగింది. సెకిల్ ర్యాలీలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహర శెట్టి నర్శింహారావు పాల్గొన్నారు.

Exit mobile version