Site icon vidhaatha

బీజేపీది మండ్ర గబ్బ పాత్ర… వైకాపాది తేలు పాత్ర

విధాత‌: బీజేపీది మండ్ర గబ్బ పాత్ర… వైకాపాది తేలు పాత్ర అని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. వడ్డించడం… వాయించడం… కుట్టడం…బాధించడం… మండ్ర గబ్బ, తేలు లక్షణాలు అని అన్నారు. సోమవారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో ధరలు పెంచడం, పన్నులు వేయడం, ప్రజలను ఆర్థికంగా బాధించడం, వేధించడం, బీజేపీ, వైసీపీ పార్టీల లక్షణాలు అన్నారు. బీజేపీ పాలనలో పెట్రోలు, డీజిల్ ధరలు సెంచరీ దాటాయని, వంటగ్యాస్ ధర పదవ సెంచరీ కి సమీపంలో ఉందన్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో మద్యం, ఇసుక, సిమెంటు, పామాయిల్ ధరలు విపరీతంగా పెరిగాయని, కరెంటు బిల్లు ముట్టుకుంటే షాక్ కొడు తోందని అన్నారు.ఔరంగజేబు జుట్టు పన్ను వేస్తే జగన్ రెడ్డి చెత్త పన్నువేశాడని, మండ్ర గబ్బాను, తేలును కొట్టి చంపుటామన్నారు.బర్వేలు ఉపఎన్నికల్లో బీజేపీ, వైసీపీ పార్టీలను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించడమే ఏకైక పరిష్కారమని తులసిరెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version