రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ, యువజన, విద్యార్థి సంఘాల నాయకుల ముందస్తు అరెస్టులను ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
విధాత:రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీతో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ ఈరోజు చలో అమరావతికి పిలుపునిచ్చిన నిరుద్యోగ, యువజన, విద్యార్థి సంఘాలు.శాంతియుత ఉద్యమాలపై పోలీసులు ఉక్కుపాదం తగదు.అరకొర ఉద్యోగాల భర్తీతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయటం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమే.గత రెండేళ్లుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా జగన్మోహన్ రెడ్డి మాట తప్పటం నిజమా కాదా?