Site icon vidhaatha

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసేది జన వంచన యాత్ర

విధాత‌: మోడీ ప్రభుత్వం ఏపీకి అడుగడుగున అన్యాయం చేసింది.ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, కడప స్టీల్ ఫ్యాక్టరీ, రాజధాని, పోలవరం నిర్మాణం, బడ్జెట్లో నిధుల కేటాయింపులలో కేంద్రం మోసం చేసిందన్నారు సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌.

కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ఆదాని, అంబానీల ఆస్తులు పెంచటమే మోడీ పాలన.పెట్రో ఉత్పత్తుల ధరలు, నిత్యవసర వస్తువుల ధరలు బీజేపీ పాలనలో అందుకోలేనంత పెరిగాయి.ఏపీ అప్పులు చేసిందని చెబుతున్న కేంద్రం ఏడేళ్లలో రూ.47 లక్షల కోట్ల నుండి రూ.119 లక్షల కోట్లకు అప్పులను పెంచడాన్ని ఏమనాలి?ఏపీ బీజేపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయ‌న విమ‌ర్శించారు.

Exit mobile version