ఆంధ్రప్రదేశ్‌ను ఆదానీ ప్రదేశ్‌గా మార్చకండి

విధాత‌: ఆంధ్రప్రదేశ్‌ను ఆదానీ ప్రదేశ్‌గా మార్చవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, గౌతమ్ అదానీల మధ్య జరిగిన రహస్య భేటీ వివరాలను వెల్లడించాలన్నారు. జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ పేరుతో ఏకంగా 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకై అదానీకి అవకాశం ఇస్తూ హడావుడిగా ఏపీ క్యాబినెట్‌లో తీర్మానాలు ఎందుకని ప్రశ్నించారు. నాలుగైదు కంపెనీలకు దక్కాల్సిన సౌర విద్యుత్ ప్లాంట్‌ను అదానీ […]

  • Publish Date - September 24, 2021 / 04:56 AM IST

విధాత‌: ఆంధ్రప్రదేశ్‌ను ఆదానీ ప్రదేశ్‌గా మార్చవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, గౌతమ్ అదానీల మధ్య జరిగిన రహస్య భేటీ వివరాలను వెల్లడించాలన్నారు. జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ పేరుతో ఏకంగా 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకై అదానీకి అవకాశం ఇస్తూ హడావుడిగా ఏపీ క్యాబినెట్‌లో తీర్మానాలు ఎందుకని ప్రశ్నించారు. నాలుగైదు కంపెనీలకు దక్కాల్సిన సౌర విద్యుత్ ప్లాంట్‌ను అదానీ ఒక్కడికే కట్టబెట్టడంలో లొసుగులేంటని నిలదీశారు. గంగవరం, కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టులను జగన్ సర్కార్ అదానీ గ్రూప్‌కు కట్టబెట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏపీలోని పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్ సంస్థలు ఆదానీకి అప్పగించడంలో లాలూచీ ఏంటన్నారు. మచిలీపట్నం పోర్ట్ ఏర్పాటు కోసం దశాబ్దాల తరబడి ఉద్యమాలు జరిగాయని, ఏపీలో పెద్ద సంస్థలు, బడా కాంట్రాక్టర్లు ఉన్నప్పటికీ కేవలం గుజరాత్‌కు చెందిన సంస్థలకే అవకాశం ఇవ్వడం వెనుక మర్మమేంటని ప్రశ్నించారు. సీఎం కుర్చీ కూడా ఆదానీకే అప్పగించండంటూ రామకృష్ణ ఎద్దేవా చేశారు.

Latest News