Site icon vidhaatha

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.

విధాత:రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం రైతులకు చెల్లించాల్సిన బకాయిలను సత్వరమే చెల్లించేందుకు చర్యలు చేపట్టండి.రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం రైతులకు రు.3 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది.ఉభయగోదావరి జిల్లాల్లోని రు.1800 కోట్ల మేర రైతులకు బకాయిలు ఉండటం గమనార్హం.అప్పులు తెచ్చి పండించిన పంటకు డబ్బులు రాకుంటే ప్రస్తుత సీజన్లో రైతులు పంట ఎలా వేస్తారు?ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి తొలగించటం పలు అనుమానాలకు తావిస్తోంది.ధాన్యం రైతుల పట్ల దళారులకన్నా దారుణంగా ప్రభుత్వం వ్యవహరించటం తగదు.

-సిపిఐ రామకృష్ణ.

Exit mobile version