Site icon vidhaatha

సీఎం జగన్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ

విధాత:గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో వైసిపి అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని, ఇంకా తగ్గిస్తామని మీరు ఇచ్చిన హామీ తుంగలో తొక్కారు.ట్రూఅప్ విద్యుత్ చార్జీల పేరుతో రూ.3669 కోట్ల భారాన్ని ప్రజలపై మోపడం తగదు.వైసీపీ అధికారంలోకి వచ్చాక గత 27 మాసాల కాలంలో 4 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారు.కేవలం 2,500 కోట్లు అప్పుకు ఆశపడి కేంద్ర ప్రభుత్వ విద్యుత్ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం సై అంటోంది.అసలే కరోనా కష్టకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల నెత్తిపై ఆస్తి, చెత్త పన్నుల పెంపు, విద్యుత్ ఛార్జీల గుదిబండ సరికాదు.విద్యుత్ చార్జీల భారాన్ని విరమించకపోతే మరో విద్యుత్ ఉద్యమం తప్పదు.

రామకృష్ణ.

Exit mobile version