Site icon vidhaatha

ప్రభుత్వ భూముల్లో ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు

విధాత:పీలేరు పరిసర ప్రాంతాల్లో వందల కోట్ల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రకటించగా, స్పందించిన సబ్ కలెక్టర్ జాహ్నవి మంగళవారం మండలంలోని ముడుపుల వేముల, బొడుమల్లువారిపల్లి ఎర్రగుంట్లపల్లి గ్రామపరిధిలో లేఔట్ల ను పరిశీలించారు.

అనంతరం తహశీల్దార్ పుల్లారెడ్డికి ప్రభుత్వ భూముల్లో ఎవ్వరూ ప్రవేశించరాదని అన్నారు.

బుధవారం రెవెన్యూ అధికారులు తమ సిబ్బందితో, పీలేరు మండలంలోని, బొడుమల్లువారిపల్లి, దొడ్డిపల్లి, ముడుపుల వేముల ఎర్రగుంట్లపల్లి తదితర గ్రామాల్లో సూచికలు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టిన అట్టి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు ఏర్పాటు చేశారు.

Exit mobile version