Site icon vidhaatha

ఆక్సిజన్ సమస్య పై స్పందించిన డిప్యూటీ సీఎం

ఆక్సిజన్ సమస్య పై స్పందించిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి కోవిడ్ ఆసుపత్రి లో ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నాం.జిల్లా కలెక్టర్, డీసీ హెచ్ ఎస్, సూపరింటెండెంట్ తో మాట్లాడానువైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని గారు దృష్టికి సమస్యను తీసుకుని వెళ్ళాను.ఐసి యూ లో ఉన్న రోగులకు సరఫరా అయ్యే ఆక్సిజన్ పంపిణీ లో ఇబ్బంది ఉంది.15 మందిని తక్షణమే వేరొక ఆసుపత్రి కి తరలిస్తున్నాం.ఆక్సిజన్ సమస్య కారణంగా ఎవ్వరు మరణించే పరిస్థితి లేదు.తిరుమల ఆస్పత్రి కి ఈ రోగులను తక్షణమే తరలిస్తున్నాం.పరిస్థితి ఇంకా సీరియస్ గా ఉంటే విశాఖ కు తరలించమని ఆళ్ల నాని గారు ఆదేశించారు.ప్రజలు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.సాయంత్రానికి ఆక్సిజన్ సరఫరా సాంకేతిక సమస్య ను కూడా పరిష్కరిస్తాం.విజయనగరం జిల్లాలో అన్ని ఆస్పత్రులలోను ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాము.

Exit mobile version