Site icon vidhaatha

అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయండి: సోము వీర్రాజు

విధాత:అమరావతిలో అనేక సంస్థలు స్థలాలు తీసుకున్నాయి.ఆ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించాలి.ఏపీ రాజధాని అమరావతిని పూర్తి స్తాయిలో అభివృద్ధి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.అమరావతి పట్ల అలసత్వం పనికిరాదని అన్నారు. రాజధాని ప్రాంతంలో తమ కార్యకలాపాల కోసం అనేక సంస్థలు స్థలాలను తీసుకున్నాయని… వాటిని ఆ సంస్థలు ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ప్రతి ఏటా తప్పనిసరిగా కౌలు చెల్లించాలని కోరారు. రాష్ట్రంలోని ఆలయాలను సందర్శించాలనే కార్యక్రమాన్ని అమరావతి ప్రాంతంలోని తాళ్లాయపాలెంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version