రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రను తరలించారు.
- ధూళిపాళ్లను ఐదు రోజులపాటు అనిశా అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.
- సంగం డెయిరీ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని.. అవినీతి నిరోధక శాఖ ఆయనపై కేసు నమోదు చేసింది.
★ సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టై .. రిమాండ్‌లో ఉన్న తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రను అనిశా కస్టడీలోకి తీసుకుంది.
★ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి ఆయన్ను విజయవాడ తరలించారు.
★ ధూళిపాళ్లతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్, సహకార శాఖ మాజీ అధికారి గురునాథంను తీసుకెళ్లారు.
★ వీరిని ఈ నెల 5 వరకు విచారించేందుకు అనిశా ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది.
★ ఆ మేరకు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ తరలించారు.
తండ్రిని చూసేందుకు..
★ అనిశా కస్టడీలోకి ధూళిపాళ్ల నరేంద్రజైలు వద్ద తండ్రిని చూసి నరేంద్ర కుమార్తె కన్నీరు మున్నీరైంది.
★ కారు అద్దం తీయమని పోలీసులను బతిమలాడింది.
★ తండ్రిని తీసుకెళ్తున్న కారు వెంట ఆమె ఆతృతగా బయలుదేరి వెళ్లింది.