విధాత,విజయనగరం :ఇటీవలి సామాజిక మాధ్యమంలో భాగమైన ఫేస్ బుక్ లో స్నేహితుల ఫోటో పెట్టి అపరిచిత వ్యక్తుల నుం చి డబ్బులు పంపించమని అడగటం పట్ల నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పి దీపికా ఎం పాటిల్ బొబ్బిలి కి చెందిన రక్షా సర్వీస్ మిషన్ అధ్యక్షుడు తుమరాడ కిషోర్ కుమార్ ఆధ్వ ర్యంలో ఎస్పి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో ఎస్పి గోడ పత్రికలను ఆవిష్కరిస్తూ సైబర్ నేరాలపైన అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో న్యా యవాది, సామాజిక కార్యకర్త తుమరాడ గంగాధర్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల ఫేక్ చర్యలను నివారించడంలో భాగంగా అపరిచిత వ్యక్తుల నుంచి ఫేస్బుక్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయొద్ద ని డబ్బులు పంపమని అడిగితే స్నేహితులకు నేరుగా ఫోన్ కాల్ చేసి వివరణ కోరాలన్నారు,జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షులు అచ్చిరెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాను క్రమ పద్ధతిలో ఉపయోగించాలని అపరిచిత వ్యక్తులతో సం భాషణ మంచిది కాదన్నారు. న్యాయవాది కూరేళ్ల శ్రీనివాస రావు మాట్లాడుతూ సైబర్ నేరాలు, వాటిని నివారించే చట్టాలపట్ల ప్రజలందరికీ అవగాహన అవసర మని తెలిపారు, అలానే కార్యక్రమంలో ములగపాటి బంగారు రాజు పాల్గొన్నారు.