Site icon vidhaatha

చంద్రబాబు.. మీ పతనం చూడాలనే ఆత్మహత్య విరమించుకున్నా: ముద్రగడ బహిరంగ లేఖ

విధాత: చంద్రబాబుకి మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. లేఖలోని సారాంశం ఏంటంటే.. ఈ మధ్య మీ శ్రీమతి గారికి జరిగిన అవమానం గురించి మీరు వెక్కి వెక్కి ఏడ వడం టీవీలో చూసి ఆశ్చర్యపోయాను. మా జాతికి ఇచ్చిన హమీని అమలు చేయమని ఉద్యమం చేస్తే.. నన్ను నా కుటుంబాన్ని మీరు చాలా అవమాన పరిచారు.

మీ కుమారుడు లోకేష్ ఆదేశాలతో పోలీసులు నన్ను బూటు కాలితో తన్నారు. నా భార్య, కుమారు డు, కోడల్ని బూతులు తిడుతూ లాఠీలతో కొట్టారు. 14 రోజుల పాటు హస్పటల్ గదిలో నన్ను..నా భార్యను ఏ కారణంతో బంధించారు. మీ రాక్షస ఆనందం కోసం హస్పటల్లో మా దంపతులను ఫోటో లు తీయించి చూసేవారు. మీరు చేసిన హింస తాలూకు అవమానాన్ని తట్టుకోలేక ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం.

అణిచివేతతో మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలన్నది మీ ప్రయత్నం కాదా..? మా కుటుం బాన్ని అవమాన పరచిన మీ పతనం నా కళ్ళతో చూడాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఆత్మహత్య ప్రయ త్నాన్ని విరమించుకున్నా నా కుటుంబాన్ని ఎంతగానో అవమానించిన మీ నోటి వెంట ఇప్పడు ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి.

మీ బంధువులు.. మీ మీడియా ద్వారా సానుభూతి పొందే అవకాశం మీకే వచ్చింది. ఆవాళ నాకు సానుభూతి రాకుండా ఉండేందుకు మీడియాను బంధించి నన్ను అనాథను చేశారు. శపథాలు చేయకండి చంద్రబాబు గారు.. అవి మీకు నీటి మీద రాతలని గ్రహించండి.

Exit mobile version