అమరావతి: కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసునని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి అన్నారు. కృష్ణా జలాలపై ఏపీ దాదాగిరి చేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు.‘‘జలాలపై ఎవరు దాదాగిరి చేస్తున్నారో.. ప్రజలు చూస్తున్నారు. జలశక్తి ఆదేశాలను కూడా తెలంగాణ పెడచెవిన పెట్టింది. జలవిద్యుత్ పేరుతో 30 టీఎంసీలు సముద్రంపాలు చేశారు.ఎగువ ప్రాంతంలో ఉన్నామనే భావనతో జలవివాదం తెచ్చారు’’ అని సజ్జల వ్యాఖ్యానించారు. ఏపీ నీటి వాటా కాపాడుకునేందుకే సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.