విధాత,కడపః అధికార పార్టీ నేతల అండదండలతో.. అనేక అక్రమాలకు పాల్పడుతూ సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న చిన్నమండెం ఎస్ఐ మైనుద్దీన్ పై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ పిసిసి నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం రాయచోటి పట్టణంలోని మండిపల్లి భవన్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ చిన్నమండెం ఎస్ఐ అక్రమాల అడ్డుఅదుపు లేకుండా పోయిందని, జనం మీద పడి దోచుకుంటున్నారని అన్నారు. చిన్నమండెం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న చిరంజీవి, అత్తర్ అలీఖాన్ అనే ఇద్దరు కానిస్టేబులు ఎస్ఐ మైనుద్దీన్ కు రామలక్షుణులు గా ఉంటూ నాటుసారా, అక్రమ ఇసుక రవాణా, నిషేధిత గుట్కా అక్రమ రవాణాకు సహకరిస్తు భారీ స్ధాయిలో అక్రమార్జనకు పాల్పడుతున్నారని ద్వజమెత్తారు.
కడప, వీరబల్లి, రాయచోటి, చింతకొమ్మదిన్నె, రామాపురం మండలాల్లో ఎస్ఐగా పని చేస్తూ కోట్లకు పడిగలెత్తి అనంతపురం జిల్లా గుంతకల్లు లో ఆధునీకరణ హంగులతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నాడని రామ్ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. చిన్నమండెం ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయన అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ఇటీవల కాలంలో కేశాపురం గ్రామం రెడ్డివారిపల్లె కు చెందిన కల్వకుంట్ల చంద్రశేఖర్ అనే వ్యక్తి నాటు సారా కాస్తున్నడని అతడిని విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కు పిలిపిచి అతడిని బెదిరించి 45 వేల రూపాయలు వసూలు చేశారన్నారు. అంతటితో ఆగకుండా మసటిరోజు 15 వేలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా అతడు ఇవ్వకపోవడంతో అతని పై కేసు నమోదు చేసి జైలు కు పంపారన్నారు. అదే విధంగా దేవగుడిపల్లె పంచాయతీలోని హరజనవాడ కు చెందిన ఆమూరి వరలక్ష్మీ, మాసయ్య అనే వృద్దుడిని కొందరు వ్యక్తులు తీవ్రంగా కొట్టి గాయపరచగా న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన దళిత మహిళ వరలక్ష్మి ని ఎస్ఐ అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు న్యాయం కోసం వెళ్లి వరలక్ష్మీని కులం పేరుతో దూషించి, అసభ్యకరంగా ప్రవర్తించి ఆమె పైనే బ్రోతల్ కేసు నమోదు చేస్తానంటూ బెదిరించి ఆమె ను అక్కడ నుండి గెంటివేశారన్నారు. మల్లూరు వద్ద అక్రమ ఇసుక రవాణా చేస్తుండంగా ఒక జేసీబీ, ట్రాక్టర్ ను ఎస్ఈబి అధికారులు పట్టుకొని స్ధానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించగా ఎస్ఐ, తహశీల్దార్ ఇద్దరూ కలిసి జేసీబీ, ట్రాక్టర్ ఓనర్లు వద్ద నుండి 35 వేలు డబ్బులు తీసుకొని జేసీబీ, ట్రాక్టర్ ను వదిలిపెట్టారన్నారు. కేశాపురం కు చెందిన ఓ యువతిని వ్యాక్సిన్ వేయించుకోలేదని ఆనంద్ రెడ్డి అనే వార్డు వాలంట్రీ అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె న్యాయం కోసం ఎస్ఐని ఆశ్రయించగా ఆమె పైనే ఎస్ఐ వలకరగా నీచంగా ప్రవర్తించి ఆమెను భయపెట్టి వాలంట్రీ పై కేసు పెట్టకుండా ఆమె ను అక్కడ నుండి ఆమె ను ఇంటికి పంపివేశారన్నారు.
మహిళల పట్ల నీచాయితి నీచంగా ప్రవర్తిస్తున్నాడని ఎందరో మహిళలు తన దృష్టికి తీసుకొచ్చారని రామ్ ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఎస్ఐ మైనుద్దీన్ పై విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులను కోరారు. అధికార పార్టీ నేతలకు తలొగ్గి పోలీసులు, అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం తగదన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారుల ఆగడాలు ఇక పై రాయచోటి నియోజకవర్గంలో సాగవని ఆయన హెచ్చరించారు.