Site icon vidhaatha

మాజీ శాసనసభ్యులు కొమ్మాలపాటి శ్రీధర్ హౌస్ అరెస్ట్.!

విధాత:పోలీసులు నారా లోకేష్ నరసరావుపేట పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ మండిపడ్డారు.రమ్య కుటుంబానికి లోకేష్, టీడీపీ అండగా ఉంటుందనే పోలీసులు టీడీపీ నేతలపై కక్షగట్టారని ఆరోపించారు.చంద్రబాబు, లోకేష్ అంటే ఈ ప్రభుత్వం భయపడి పోతుందన్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో జగన్ పాదయాత్రలను, దీక్షలను ఎప్పుడు అడ్డుకోలేదని,ఆరోజు ఇదేవిధంగా మేము చేసి ఉన్నట్లయితే మీ నాయకుడు పరిస్థితి, మీ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించుకోవాలి పోలీసు వారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, కానీ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించకూడదు, ఇది సరైన విధానం కాదు అన్నారు.

Exit mobile version