Site icon vidhaatha

ప్రభుత్వ ఆస్పత్రులు మరింత మెరుగవ్వాలి: జగన్ మోహన్ రెడ్డి

విధాత:అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు మరింత మెరుగుపడాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ నియంత్రణ, వైద్యశాలలు, నాడు- నేడుపై ఇవాళ సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చి దిద్దాలని నిర్దేశించారు. 45 ఏళ్లుపైబడిన వారు, గర్భిణీలకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆగస్టు 16 నుంచి పాఠశాలలు తెరవనున్నందున ఉపాధ్యాయులందరికీ టీకాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. కొవిడ్‌ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం జగన్‌ సూచించారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు తక్కువ మంది హాజరయ్యేలా చూడాలన్నారు. కొవిడ్‌ పట్ల వచ్చే రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Exit mobile version