విధాత: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ఆరోగ్యం మెరుగు పడింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయి, నవంబర్ 17న హైదరాబాద్‌లోని ఎఐజీ హాస్పిటల్‌లో చేరిన గవర్నర్ వైద్యపరంగా మెరుగుపడుతున్నారు. సాధారణంగానే ఆక్సిజన్ తీసు కుంటూ వేగంగా కోలుకుంటున్నట్లు వైద్యులు నిర్ధారించారని
గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. ప్రాణాధా రాలను కొనసాగిస్తున్నారని, ఏఐజీ హాస్పిటల్స్ కు చెందిన ఉన్నత స్థాయి వైద్యుల బృందం నిరంతరం గవర్నర్ హరిచందన్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తుందని సిసోడి యా పేర్కొన్నారు