Site icon vidhaatha

భర్తతో గొడవపడి ఆత్మహత్యకు యత్నించిన మహిళ

విధాత‌:భర్తతో గొడవపడి రైలు కిందపడి చనిపోవాలనుకున్న మహిళను గుత్తి సి.ఐ రాము ఆధ్వర్యంలో పోలీసులు కాపాడారు. ఆమెను పోలీసు స్టేషన్ కు తీసికెళ్లి బాధలను విన్నారు. ఆతర్వాత ఆమె భర్తను పోలీసు స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. మున్ముందు ఆమెను వేదింపులకు గురి చేయకుండా మంచిగా చూసుకోవాలని సూచించారు. భార్యను ఇబ్బంది పెట్టనని భర్త తెలియజేసి తన వెంట ఆమెను ఇంటికి తీసికెళ్లాడు. మహిళ ప్రాణాలు కాపాడిన గుత్తి సి.ఐ రాము ఆధ్వర్యంలో పోలీసులను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు అభినందించారు.

Exit mobile version