Site icon vidhaatha

శ్రీశైలం జలాశయానికి భారీ వరద నీరు

విధాత :శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లోని కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటీమట్టానికి చేరుకుంది. జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి నీటిని కిందకి వడలటంతో ఆ వరదనీరు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది.ప్రస్తుతం ఇవాళ ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 69,855 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 7,063 క్యూసెక్కులు గా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా….ప్రస్తుతం 820.37 అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 41.11 (19.05%) టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమగట్టు (తెలంగాణ) జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా…. ఇప్పటికి కూడా కుడి గట్టు (ఆంధ్రప్రదేశ్) జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి మాత్రం ప్రారంభం కాలేదు.

Exit mobile version