విధాత,విశాఖ:నేడు విజయనగరం,విశాఖ,ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది.రేపు కోస్తాంధ్రలోని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించింది.రుతుపవన ద్రోణి, ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా రాగల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది.