Site icon vidhaatha

రెండేళ్లలో ఏపీలో కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఎన్ని..రామకృష్ణ సూటి ప్రశ్న.

విధాత :వైసీపీ ప్రభుత్వ తిరోగమన విధానాల వల్ల ఏపీలో కొత్తగా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేకపోగా, ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి.లులూ గ్రూప్, రిలయన్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ట్రైటాన్ వంటి సంస్థల పెట్టుబడులు తరలిపోయినట్లు తెలుస్తోంది.పారిశ్రామిక పురోగతి లేకుండా రాష్ట్ర ప్రగతి ఎలా సాధ్యం?జగన్మోహన్ రెడ్డి ఏపీ నుండి రాజ్యసభ సభ్యునిగా గెలిపించిన పారిశ్రామికవేత్త పరిమల్ నత్వాని ద్వారా ఏపీకి ఎంత పెట్టుబడులు వచ్చాయి?గత రెండేళ్లలో వైసిపి ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎన్ని ఉద్యోగాలిచ్చింది?

Exit mobile version