Site icon vidhaatha

సీఎం జగన్ నివాసం వద్ద భారీ బందోబస్తు

విధాత:తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నివాసం వద్ద భారీ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. తాడేపల్లి పెట్రోల్ బంక్ నుండి సీఎం నివాసానికి వెళ్లే దారిలో నాలుగు చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశారు.అలాగే ప్రతి బస్సు ను చెక్ చేయడం జరిగింది . వచ్చే పోయే వారిని సెక్యురిటి సిబ్బంది అణువణువునా తనిఖీ చేస్తున్నారు. 2లక్షల 30 వేల ఉద్యోగాలు కల్పించాలంటూ ఛలో తాడేపల్లికి తరలిరావాలంటూ ఆల్‌పార్టీ విద్యార్థి, యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం నిరుద్యోగులను మోసగిస్తోందని విద్యార్థి, యువజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థి, యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్ సహా వివిధ సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి.ఈ క్రమంలోనే సీఎం నివాస పరిసరాల్లో పోలీసుల భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాజధానిలో రైతు నేతలకు కూడా సీఆర్‌పీసీ సెక్షన్ 149 ప్రకారం పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Exit mobile version