Site icon vidhaatha

నా జన్మ దినోత్సవం సందర్భంగా హడావిడి, ఆడంబరాలు వద్దు .. విజయసాయిరెడ్డి

విధాత:నా జన్మ దినోత్సవం సందర్భంగా ఎటువంటి ఆడంబరాలు వద్దు. కొందరు పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహంతో ఫ్లెక్సీలు, ప్రకటనలు ఇవ్వడం నా దృష్టికి వచ్చింది. వారందరికీ వినయపూర్వకంగా నేను చేస్తున్న విజ్ఞప్తి ఇది.

మీకు చేతనైనంత మేరకు కరోనా బాధితులను ఆదుకోండి.

నా పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి హడావిడి, ఆడంబరాలు చేయవద్దని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.నేను పుట్టినరోజు వేడుకలకు సహజంగా దూరంగానే ఉంటాను. కోవిడ్‌ సమయంలో ఇటువంటివి జరుపుకోవడం నాకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని తెలియజేస్తున్నాను.

హృదయపూర్వకంగా నన్ను ఆశీర్వదిస్తున్న వారికి కృతజ్ఞతలు.

(పార్లమెంటు సభ్యుడు, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు).

Exit mobile version