Site icon vidhaatha

ఓబీసీ’ల ఆదాయ పరిమితి పెంపు

నాన్‌ క్రీమీలేయర్‌ ఆదాయ పరిమితి రూ.8 లక్షలకు పెంపు

విధాత,వెలగపూడి : ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లకు అర్హత ఆదాయ పరిమితిని పెంచింది. ప్రస్తుతం ఏడాదికి రూ.6 లక్షలుగా ఉన్న ఆదాయ పరిమితిని రూ.8 లక్షలుగా మార్చింది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇక నుంచి రూ.8 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉన్న ఓబీసీలు మాత్రమే క్రీమీలేయర్‌ పరిధిలోకి వస్తారు.అంతకన్నా తక్కువ ఆదాయమున్న వారంతా విద్య, ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్లకు అర్హత పొందుతారు.సర్టిఫికెట్ల జారీలో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులను రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆదేశించింది.

Exit mobile version