Site icon vidhaatha

కుప్పకూలినా కనికరమే లేదా..!

జిల్లాలో కొవిడ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరోవైపు ఆసుపత్రుల్లో పడకలు దొరక్క బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ట్రయేజ్‌ విభాగం వద్ద ఆదివారం ఓ బాధితుడు ఇలా పడిపోయి కనిపించాడు.

ఆ పక్కనే వైద్యులు, సిబ్బంది ఉన్నా కనీసం ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎ.కృష్ణమూర్తి వద్ద ప్రస్తావించగా మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Exit mobile version