Site icon vidhaatha

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు జారీ

ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. ఇక ఆర్టీసీ ఉద్యోగులు సైతం ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా రిఫరల్‌, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసే మాదిరిగా ఎంప్లాయ్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌)కార్డులను(హెల్త్‌కార్డులు) ఆర్టీసీ ఉద్యోగులకు జారీ చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్డులను వినియోగించుకుని రిఫరల్‌, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యసేవలు పొందవచ్చు.

Exit mobile version