Site icon vidhaatha

కేసీఆర్‌ను చూసి జగన్ నేర్చుకోవాలి: నారాయణ

విధాత,తిరుపతి : కోవిడ్ నేపథ్యంలో కేంద్రం మాటలతో దగా చేసిందని, ప్రజాలను కాపాడలేకపోయిందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆక్సిజన్ అందక ఒక్కరూ చ నిపోలేదన్న కేంద్రమంత్రిపై 420 కేసు పెట్టాలన్నారు. తి రుపతి రుయా ఆస్పత్రిలోనే ఆక్సిజన్ అందక 23 మంది చనిపోయారన్నారు. బ్లాక్‌మెయిల్ రాజకీయాల కోసం పె గాసస్‌ను కేంద్రం వాడుకుంటోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధును స్వాగతిస్తున్నాన న్నారు. కేసీఆర్‌ను చూసి ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేర్చు కోవాలన్నారు. ఢిల్లీలో ఆగష్టు 2, 3న విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేయనున్నట్లు చె ప్పారు. అలాగే ఆగస్టు 5న పోలవరం సాధనకు ఉద్యమం చేస్తామని నారాయణ స్పష్టం చేశారు.

Exit mobile version