Site icon vidhaatha

జగన్ ఖర్చు తగ్గించుకోవాలి : ఎంపీ రఘురామకృష్ణరాజు

విధాత,ఢిల్లీ : రూపాయి జీతం తీసుకొనే సీఎం జగన్ హెలికాప్టర్‌ ఖర్చు తగ్గించుకుంటే మంచిదని ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ జన బాహుళ్యంలోకి రావాలని కోరారు. అన్యాయం జరిగితే ప్రజలు పులుల్లా మారాలని పిలుపునిచ్చారు. మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద మనసు చేసుకొని ఇళ్ల నిర్మాణం ప్రారంభించారని, అయితే ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం లేదని ప్రజలు బాధ పడుతున్నారని రఘురామ తెలిపారు. ఇళ్ల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ప్రజలు విశ్వసిస్తారని చెప్పారు. సీజేఐ రమణ మాతృభాషలో విచారణ జరపడం సంతోషకరమని,మాతృభాషలో వచ్చే స్పందన పరాయిభాషలో రాదని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.

Exit mobile version