Site icon vidhaatha

జగన్ బెయిల్ రద్దు పిటిషన్​పై నేడు విచారణ

అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఎంపీ రఘురామ వేసిన పిటిషన్​పై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది.

విధాత:రఘురామ,జగన్ ఇప్పటికే వాదనలు వినిపించటంతో పాటు కోర్టుకు లిఖితపూర్వకంగా సమర్పించారు.నేడు సీబీఐ తన వాదనలను సమర్పించనుంది.అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు కోరుతూ ఎంపీ రఘురామ దాఖలు చేసిన వ్యాజ్యంపై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరగనుంది.లిఖితపూర్వక వాదనల సమర్పణకు ఈ నెల 27న సీబీఐ గడువు కోరగా… విచారణ నేటికి వాయిదా పడింది.
ఇప్పటికే రఘురామ, జగన్ వాదనలు వినిపించి లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించారు.షరతులు ఉల్లంఘించారని రఘురామ వాదించగా.. తాను ఒక్క షరతూ ఉల్లంఘించలేదని జగన్‌ ప్రతివాదించారు.తాము వాదించేదేమీ లేదని విచక్షణ మేరకు చట్టప్రకారం వ్యాజ్యంలోని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని మొదట సీబీఐ పేర్కొంది.తర్వాత లిఖితపూర్వక వాదనల సమర్పణకు సమయం కోరింది.ఇవాళ సీబీఐ ఏం చెప్పబోతొందనేది.. తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Exit mobile version