విధాత,గుంటూరు: జల వివాదాల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మెతక వైఖరి కనబరుస్తున్నారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు బలి చేస్తున్నారన్నారు. రైతులకు నష్టం జరిగితే బీజేపీ చూస్తూ ఊరుకోదని కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. సోమవారం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మొక్కలు నాటారు.