రాయలసీమ ప్రజా సంఘాల తీవ్ర సంతాపం.
జలసాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి, ఓ.పి.డి.అర్ జిల్లా కార్యదర్శి యం. రామకృష్ణ శనివారం నాడు హఠాత్తుగా మరణించడం తీవ్ర భాధకరమని రాయలసీమ ప్రజా సంఘాల నాయకులు సంతాపం ప్రకటించారు.
యం.రామకృష్ణ బుక్కపట్నం మండలం, గూనిపల్లి గ్రామంలో జన్మించారు. వ్యవసాయ శాఖలో వ్యవసాయ అధికారిగా పని చేసి విశ్రాంత జీవితం గడిపారు.
విద్యార్థి దశలో నుండే ప్రగతిశీల భావజాలం పట్ల ఆసక్తి కలిగి ఉండే వారు.
సమకాలీన అంశాల పట్ల ఎన్నో కవితలు రాసారు. వ్యాసాలు రాసేవారు. ఎన్నో ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
రాయలసీమ సాగునీటి సాధన కోసం 2015 లో ఏర్పడిన జలసాధన సమితి ప్రధాన కార్యదర్శి గా బాద్యతలు నిర్వహించారు. గత ఆరేడేళ్ళ కాలంగా రాయలసీమ కోసం జరిగే ప్రతి పోరాటంలో భాగస్వామ్యం అయ్యారు.
సాహిత్య సామాజిక కార్యక్రమాలలో పాల్గొని యువతకు అండగా నిలిచేవారు.
రామకృష్ణ గారిని కోల్పోవడం జిల్లా సాగునీటి ఉద్యమానికి తీవ్రలోటని జలసాధన సమితి అధ్యక్షులు రాంకుమార్, రైతుకూలీ సంఘం నాయకులు ప్రభాకరరెడ్డి, రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్‌గా బొజ్జా దశరథరామిరెడ్డి, లోచర్ల పెద్దారెడ్డి మెమోరియల్ అధ్యక్షులు విజయ భాస్కర రెడ్డి, వేమన అధ్యయన అభివృద్ధి & అధ్యయన కేంద్రం డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి,
ఓ.పి.డి. ఆర్ రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు.
ఆర్.యు.యఫ్ నాగార్జున రెడ్డి, రాయలసీమ సోషియల్ మొఇడీయాఫోరం అశోక్ రెడ్డి, రాడ్స్ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి, రాయలసీమ సాంస్కృతిక వేదిక పి. రాజశేఖరరెడ్డి, దామోదర్ రెడ్డి, రవికుమార్ తదితరులు పేర్కొన్నారు.