విధాత:జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మంత్రి వెల్లంపల్లి, మేయర్ భాగ్యలక్ష్మి పై ఆరోపనలు చేశారు.విజయవాడ కార్పొరేషన్ లో 150పోస్ట్ ల నియామకం పేరుతో మూడు కోట్లు దోచుకున్నారు మంత్రి వెల్లంపల్లి, మేయర్ భాగ్యలక్ష్మి ఒక్కొక్కరి నుంచి రెండు లక్షలు వసూలు చేశారు పేపర్ నోటిఫికేషన్ లేకుండా కార్పొరేషన్ ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారన్నారు.మున్సిపల్ కమిషనర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ వెంటనే స్పందించి విచారణ చేయించి, చర్యలు తీసుకోవాలి.
మంత్రి వెల్లంపల్లి, మేయర్ కు సవాల్ విసురుతున్నా మూడు కోట్లు పుచ్చుకున్న ఆధారాలను త్వరలో బయట పెడతా మూడు నెలల్లో కియా కారు కొన్న మేయర్.. కు డబ్బులు ఎలా వచ్చాయి.వెల్లంపల్లి అవినీతి పై జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి స్పందించాలి వారు చర్యలు తీసుకోకపోతే… ముడుపులు ముడుతున్నాయని భావించాలి ప్రభుత్వ పెద్దల అండతోనే వెల్లంపల్లి అవినీతి చేస్తున్నారనేది మా నమ్మకం ప్రభుత్వం స్పందించకపోతే.. న్యాయ స్థానం ద్వారా పోరాటం చేస్తామన్నారు.