జర్నలిస్ట్ వెల్లంకి అరుణ కుమార్ (73)కన్నుమూశారు. 10 రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన ఈరోజు ఉదయం విజయవాడలో ని ప్రయివేటు హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. వైద్యులు వెంటిలేటర్ చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మరణించారు. అరుణ కుమార్ ఈనాడులో పనిచేశారు. అరుణ కుమార్ గారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖో ఖో కోచ్ ఝాన్సీ గారి భర్త.
కరోనా మన నుండి ఒక మంచి వ్యక్తిని దూరం చేసింది. వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని, ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజెస్తున్నాం…